Share News

గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:22 PM

ని యోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కృషి చే స్తామని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంటా

- మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

తెలకపల్లి, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ని యోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి కృషి చే స్తామని స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల వేళ మండలంలోని గౌరారం గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రామాలలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క లబ్ధిదా రుడికి, ప్రతీ ఇంటికి చేరాలంటే కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. గౌరారంలో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లీశ్వరిరఘు, వార్డు సభ్యులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, ఎవ్వరికి ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటా నని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:22 PM