Share News

రారండోయ్‌..వేడుక చూద్దాం

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:16 PM

జిల్లా వ్యాప్తంగా కోదండరామాలయాలు, శ్రీ వెం కటేశ్వర ఆలయాలు, అంజనేయస్వామి ఆలయాలల్లో కల్యాణ మహోత్సవం నిర్వహణకు ఆయా ఆలయ క మిటీలు అన్ని ఏర్పాటు చేశాయి. సీతారామ కల్యాణం సందర్భంగా స్వామి వారికి తలంబ్రాలను తయారు చేస్తారు. ఆలయాల వద్ద పచ్చని పందిళ్లు, షామి యానాలు, వివిధ అలంకరణలు పూర్తయ్యాయి. కల్యా ణం అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నారు. సా యంత్రం వేళలో పుర వీధుల్లో పల్లకి సేవా కార్య క్రమాలు నిర్వహిస్తారు.

రారండోయ్‌..వేడుక చూద్దాం

రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం

ఏర్పాట్లు చేసిన అధికారులు

ఆలయాల్లో అన్నదానాలు

తరలిరానున్న భక్తజనం

నేడు శ్రీరామనవమి

=======================

నస్పూర్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) :

జిల్లా వ్యాప్తంగా కోదండరామాలయాలు, శ్రీ వెం కటేశ్వర ఆలయాలు, అంజనేయస్వామి ఆలయాలల్లో కల్యాణ మహోత్సవం నిర్వహణకు ఆయా ఆలయ క మిటీలు అన్ని ఏర్పాటు చేశాయి. సీతారామ కల్యాణం సందర్భంగా స్వామి వారికి తలంబ్రాలను తయారు చేస్తారు. ఆలయాల వద్ద పచ్చని పందిళ్లు, షామి యానాలు, వివిధ అలంకరణలు పూర్తయ్యాయి. కల్యా ణం అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నారు. సా యంత్రం వేళలో పుర వీధుల్లో పల్లకి సేవా కార్య క్రమాలు నిర్వహిస్తారు.

ఫ పెళ్లి ముహూర్తం ఇదీ..

శ్రీరామనవమి హిందువులకు ముఖ్యమైన పండగ. శ్రీరాముడి జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు దేశ వ్యాప్తంగా రాముడి పూజలు చేస్తారు. ఉదయం 11.51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగ నుంది.

ఫ వడపుప్పు పానకం...

శ్రీరామ నవమి రోజున పానకం-వడపప్పుకు అధిక ప్రాధాన్యత ఉంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. వేస వి కాలం కాబట్టి వీటిని ప్రసాదంగా తీసుకోవడం వ లన ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతుందని ఆ యుర్వేద పండితులు చెబుతున్నారు. పానకం విష్ణువు కి ప్రీతిపాత్రమైనది.

ఫ భక్తిశ్రద్ధలతో కల్యాణం

- మారుపాక ఫణి కుమార్‌ శర్మ- నస్పూర్‌ కాలనీ

సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయాల్లో, ఇళ్లలో ప్రత్యేక పూజల కార్యక్రమాలను నిర్వహిస్తారు. నవమి రోజు ఉదయమే భక్తులు తల స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గడపకు పసు పు, కుంకుమ ఇంటి ముందర రంగవల్లికలతో అలంక రించాలి. శ్రీసీతారామలక్ష్మణ, భరత, శతృఘ్నుల చిత్ర పటాములు, శ్రీరాముడి ప్రతిమను పూజకు ఉపయోగించ వచ్చు.

-----------------------

ముస్తాబైన ఆలయాలు.

మందమర్రి టౌన్‌: పట్టణంలో ఈ నెల 6న సీతా రాముల కల్యాణం సందర్భంగా పలు ఆలయాలు ము స్తాబయ్యాయి. స్థానిక మూడో జోన్‌లోని శ్రీ సీతా రామ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి ది ద్దారు. మైదానంలో భక్తులు కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆ లయం వద్ద ఏర్పాట్లు చేశారు. మూడో జోన్‌ సీతారా ముల ఆలయంతో పాటు పంచముఖ ఆలయానికి వే లాదిగా భక్తులు రానున్న దృష్ట్యా సౌకర్యాలు కల్పించ డంలో నిమగ్నమయ్యారు. కల్యాణానికి సంబంధించిన పెండ్లి పత్రికలను పంపిణీ చేస్తున్నారు.

దండేపల్లి: శ్రీరామనమిని పురస్కరించుకుని దండేపల్లి మండల పలు గ్రామాల్లో దేవాలయాలు సర్వ సుందరంగా ముస్తాబు వేశారు. కల్యాణానికి వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అఽభివృద్ధి క మిటీ, హనుమాన్‌ దీక్షపరుల అధ్వర్యంలో సౌకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు పనులలో నిమ గ్నమయ్యారు. కళ్యాణం తిలకించేందుకు వచ్చి భ క్తుల కోసం ఆలయం వద్ద స్వామి వారి తీర్ధ ప్రసాదాలతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

47డిపిఎల్‌05: దండేపల్లి శ్రీసీతారామాంజనేయ ఆలయంపై పాలపొరక వేస్తున్న భక్తులు.

సీతారాములోరి పెళ్లి పాలపొరక.

దండేపల్లి: శ్రీసీతా రాముల కల్యాణ వేడుకల్లో భాగంగా శనివారం దండేపల్లి మండలంలోని పలు గ్రామాలోని దేవాలయాలలో పారపొరక(పచ్చని పందిరి) వేడుకలను వైభోపేతంగా నిర్వహించారు. భక్తులు, దీక్షపరులు ఊరురా ఎడ్లబండ్లలో పచ్చని పాలపొరకను మహిళలు మంగళహారలతో, సన్నా యి వాయిద్యాలతో ఘనం స్వాగతంతో ఆలయానికి తీసుకవచ్చి ఆలయంపై ఏర్పాటు చేసిన పందిర్లపై వేశారు.

జన్నారం : సీతారాముల కల్యాణానికి జన్నారం మండలంలోని రామాలయాలు శ్రీరామనవమికి ము స్తాబయ్యాయి. విద్యుద్ధీపాలతో అలంకరించారు. మం డల కేంద్రంలోని రామాలయం, రేండ్లగూడ, తిమ్మా పూర్‌, రాంపూర్‌ గ్రామాల్లోని ఆలయాల్లో పండగ సం దడి మొదలైంది.

సుద్దాల ఆలయంలో ఏర్పాట్లు..

చెన్నూరు : చెన్నూరు మండలంలోని సుద్దాల గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరా మనవమికి ముస్తాబైంది. అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ప్రతి యేటా ఇక్కడ శ్రీరామనవమి పర్వదినం సీతారా ముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఏడు రోజుల పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలను నిర్వ హిస్తుంటారు. ఉత్సవాలకు నియోజకవ ర్గం నుంచే కాకుండా మంచిర్యాల, గోదావరిఖని, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.

కాసిపేట : నేడు మండలంలో జరగనున్న సీతా రాముల కల్యాణానికి సీతారామాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. దుబ్బగూడెం, కాసిపేట, రేగుల గూడెం, కోమటిచేను, ధర్మారావుపేట, సల్పలవాగుల్లో ని ఆలయాలు చలువ పందిళ్లతో విద్యుత్‌ దీపాలతో ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లను చేశారు.

Updated Date - Apr 05 , 2025 | 11:16 PM