kumaram bheem asifabad- తరలివచ్చి.. నివాళులు అర్పించి..
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:18 PM
జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసి హక్కుల సాధన కోసం పోరాడి అసువులు బాసిన పోరాట వీరుడు ఆదివాసీల ఆరాధ్యదైవం కుమరం భీం 85వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జోడేఘాట్‌కు మంత్రులు, అధికారులు తరకలివచ్చి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కుమరం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు అధికారికంగా వర్థంతి ఉత్సవాలను చేపట్టడంతో జోడేఘాట్‌కు వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు.
- వేలాదిగా తరలి వచ్చిన గిరిజనులు
- భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రులు లక్ష్మణ్‌కు మార్, జూపల్లి కృష్ణారావు అధికారులు
- పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు
ఆసిఫాబాద్/ ఆసిఫాబాద్ రూరల్/ కెరమెరి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జల్ జంగల్ జమీన్ కోసం, ఆదివాసి హక్కుల సాధన కోసం పోరాడి అసువులు బాసిన పోరాట వీరుడు ఆదివాసీల ఆరాధ్యదైవం కుమరం భీం 85వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జోడేఘాట్‌కు మంత్రులు, అధికారులు తరకలివచ్చి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కుమరం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు అధికారికంగా వర్థంతి ఉత్సవాలను చేపట్టడంతో జోడేఘాట్‌కు వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించారు. కుమరం భీం వర్ధంతి ఉత్సవాలకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జిల్లా ఇన్‌చారి మంత్రి జూపల్లి కృష్ణారావులు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రజాదర్బార్‌ను రద్దు చేశారు. దీంతో ఎవరికి వారే భీంకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ ఆదివాసీల ఆభివృద్దియే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని అన్నారు. ఆదివాసీల ఆభివృద్ది కోసం రూ. 740 కోట్లు గత పక్షం రోజుల క్రితం విడుదల చేసినట్లు తెలిపారు. భీం పోరాటం అందరికి అదర్శమన్నారు. అయన పోరాటాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భీం వర్థంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధారణంగా నిర్వహించామని చెప్పారు. ఆశ్రమ పాఠశాలల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం అనాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమరంభీం గొప్ప వ్యక్తి అని కొనియడారు. అనాటి నినాదమైన జల్ జంగల్ జమీన్ నేటికి కొనసాగుతుందన్నారు. చదువు, పోరాడు, సాధించు అనే అంబేద్కర్ నినాదాన్ని తీసుకున్న కుమరంభీం నేడు చరిత్రంలో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియడారు. ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు అధికారికంగా భీం వర్థంతి ఉత్సవాలను గిరిజన సంప్రదాయ రీతిలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఏఎస్పీ చిత్తరంజన్, భీం మనుమడు సోనేరావు కుటుంబ సభ్యులతో కలిసి గిరిజన సంప్రదాయ రీతిలో జెండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భీం సమాధి వద్ద, భీం విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. . ఈ సందర్భంగా భీం మనుమడు సోనేరావు కుటుంబ సభ్యులకు సంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలను అందజేశారు. అలాగే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అయా పార్టీల ప్రజాప్రతినిదులు, నాయకులు వేర్వేరుగా భీంకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీష్‌బాబులతో పాటు మాజీ ఎంపి సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు అత్రం సక్కు, కోనేరు కోనప్ప, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, మాజీ జడ్పీ ఛైర్మన్ సిడాం గణపతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, వన్‌నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్‌రావు, తుడుందెబ్బ రాష్ట్ర అద్యక్షుడు కొట్నాక విజయ్, తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచయ్య, అయా పార్టీల నాయకులు భీంకు ఘన నివాళులర్పించారు. భీం వర్థంతి వేడుకలకు ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే కుమరంభీం అనుచరుడు కుమరం సూరు విగ్రహనికి మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కుమరం లాల్‌షా, సభ్యులు పెందూరు రాజేశ్వర్, మోతిరాం, జిల్లా గిరిజన సంక్షేమాధికారి రమదేవి, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి దత్తరావు, డీఎల్‌పీవో ఒమర్ హుస్సేన్, మాజీ ఎంపీపీలు బాలేశ్వర్‌గౌడ్, కలాం తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లడుతూ కుమరంభీం స్పూర్తీతో యువత ముందుకు సాగాలలని చెప్పారు. జల్, జంగల్. జమీన్ హక్కుల కోసం పోరాడిన వీరుడు కుమరంభీం అని కొనియాడారు. జోడేఘాట్ అభివృద్ధి కేసీఆర్ హయంలోనే జరిగిందన్నారు. జిల్లాకు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా పేరు పెట్టిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
ఫ భీం మనమడు సోనేరావు మాట్లాడుతూ ప్రభుత్వం భీం ఆశయాలను నేరవేర్చాలని కోరారు. ఏజెన్సీలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలన్నారు. ఆసంపూర్తిగా ఉన్న జోడేఘాట్ రోడ్డును పూర్తి చేయాలని కోరారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని తెలిపారు.
ఫ కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో గిరిజనుల అభివృద్దికి, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, కుమరం భీం ఆని కొనియాడారు. కుమరంభీం స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి ప్రజల సంక్షేమంలో ముందుకు సాగుతామని తెలిపారు.
ఫ కుమరం భీం వర్ధంతి సభకు రాష్ట్ర మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, తదితర ప్రముఖులు రావడంతో పోలీసులు పకడ్బందీ బందోబస్తును నిర్వహించారు. మూడు రోజుల నుంచి జోడేఘాట్ అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కుంబింగ్ నిర్వహిస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్ బృంధాలు అణువణువు తనిఖీలు చేపట్టాయి. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, ప్రత్యేక పోలీసు బలగాలు భారీ బందో బస్తు నిర్వహించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
కుమరం భీం వర్ధంతి సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోండి భాషలో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ చేసిన ప్రదర్శనలు అలరించాయి. ఈ మేరకు కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఆయా ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. మెడికల్ అండ్ హెల్త్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సఖి, సమగ్ర గిరిజన ఆభివృద్ది శాఖ, పంచాయతీరాజ్‌శాఖ, గిరిజన సంక్షేమశాఖ, డీఆర్‌డీఏలు తవ,ు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి ఫొటో గ్యాలరీలను ప్రదర్శించారు.