Colonies and Bastis Rally: హైడ్రాకు కాలనీలు, బస్తీల మద్దతు
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:07 AM
హైడ్రాకు మద్దతుగా పలు బస్తీలు, కాలనీల ప్రజలు ప్రదర్శనలు చేపట్టారు. మణికొండ మర్రి చెట్టువద్ద 15 కాలనీల ప్రజలు ర్యాలీ నిర్వహించారు....
ర్యాలీలు, ప్లకార్డులతో అనుకూల ప్రదర్శనలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): హైడ్రాకు మద్దతుగా పలు బస్తీలు, కాలనీల ప్రజలు ప్రదర్శనలు చేపట్టారు. మణికొండ మర్రి చెట్టువద్ద 15 కాలనీల ప్రజలు ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలో వెయ్యికోట్ల రూపాయల విలువైన పార్కులు కాపాడి నగర ప్రజలకు ప్రాణ వాయువును అందించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ నుంచి స్థానికులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్రశాంతిహిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని రాఘవేంద్రకాలనీలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలనీలో 4300 గజాల ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడార ంటూ ర్యాలీ నిర్వహించారు. రాఘవేంద్రకాలనీలో 2 వేల గజాల పార్కును కాపాడినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు. హైడ్రాపై దుష్ప్రచారం వద్దని, కూల్చివేతలన్నింటినీ హైడ్రాకు ఆపాదించి సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేయడం తగదన్నారు. దశాబ్దాల సమస్యలను గంటలు, రోజుల్లో పరిష్కరించే సత్తా హైడ్రాకు ఉందంటూ ప్రశంసలు కురిపించారు.