FATHI strike: రెండోరోజూ కాలేజీలు బంద్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:39 AM
ఉన్నత విద్యాసంస్థల సమ్మె రాష ్ట్రవ్యాప్తంగా రెండో రోజూ కొనసాగింది. తొలిరోజు 98 శాతం కాలేజీలు సమ్మెలో పాల్గొంటే మంగళవారం రెండో రోజు 99 శాతం కాలేజీలు పాల్గొన్నాయని తెలంగాణ...
ఫీజు బకాయిల కోసం 1800 కాలేజీల మూత
యథాతథంగా ఫార్మసీ పరీక్షలు.. 88 ు గైర్హాజరు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాసంస్థల సమ్మె రాష ్ట్రవ్యాప్తంగా రెండో రోజూ కొనసాగింది. తొలిరోజు 98 శాతం కాలేజీలు సమ్మెలో పాల్గొంటే మంగళవారం రెండో రోజు 99 శాతం కాలేజీలు పాల్గొన్నాయని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సంఘాల సమాఖ్య (ఫాతీ) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, లా, మేనేజ్‌మెంట్, ఇతర వృత్తివిద్య కాలేజీలు కలిపి మొత్తం 1800 ఉన్నత విద్యాసంస్థలు సమ్మెలో పాల్గొన్నాయని పేర్కొంది. అయితే మంగళవారం నుంచి బీ-ఫార్మసీ రెండో సెమిస్టర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీలు, ఇతర కాలేజీలు ఈ పరీక్షలను వాయిదా వేయగా.. జేఎన్‌టీయూ పరిధిలో మాత్రం వాయిదా వేయలేదు. పరీక్షలు కొనసాగించాలన్న విద్యాశాఖ ఉన్నతాధికారి ఆదేశాలతో యథాతథంగా కొనసాగించారు. పరీక్షలు వాయిదా వేయాలని కాలజేఈలు కోరినా జేఎన్‌టీయూ అధికారులు ససేమిరా అనడంతో కొన్ని కాలేజీలు పరీక్షల నిర్వహణకు అంగీకరించాయి. రాష్ట్రంలో జేఎన్‌టీయూ గుర్తింపు పొందిన ఫార్మసీ కళాశాలలు మొత్తం 61 ఉండగా, ఇందులో రెండు ప్రభుత్వ, 59 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. మంగళవారం 9 కాలేజీలు మాత్రమే పరీక్షలు నిర్వహించగా, 52 కాలేజీల్లో విద్యార్థులు గైర్హాజరైనట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం ప్రకటించింది. మొత్తం విద్యార్థుల్లో 88 శాతం గైర్హాజరైనట్లు పేర్కొంది. మరోవైపు సమ్మెను మరింత ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఫాతీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 8న ఎల్టీ స్టేడియంలో 30వేల మంది కాలేజీల సిబ్బందితో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించి అనుమతులు పొందింది. అయితే మంగళవారం అనుమతులు ఇచ్చిన తర్వాత వాటిని పోలీసుశాఖ రద్దు చేసింది. దీనిపై బుధవారం హైకోర్టుకు వెళ్లి అనుమతులు పొందాలని ఫాతీ నిర్ణయించింది. అలాగే ఈనెల 11న 10లక్షల మంది విద్యార్థులతో సచివాలయానికి లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు సమ్మె ఆపాలని ఫాతీని ప్రభుత్వం కోరింది. రూ.450కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని ఉన్నతాధికారులు ఫాతీ అధ్యక్షుడు రమే్‌షబాబుకు ప్రతిపాదించగా.. ఆయన నిరాకరించారు. ఈ విద్యా సంవత్సరం బకాయిలు కలుపుకొని రూ.10వేల కోట్లు రావాల్సి ఉందని, కనీసం రూ.5వేల కోట్లు ఇస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు.
విచారణకు వస్తున్నాం.. వద్దు సమ్మెలో ఉన్నాం..
ఫీజు రీయింబర్స్‌మెంట్ దుర్వినియోగంపై ప్రభుత్వం వారం క్రితం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విజిలెన్స్, పోలీసు శాఖతోపాటు సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, యూనివర్సిటీ అధికారులతో కూడిన కమిటీలు అన్ని కాలేజీలకు వెళ్లి విచారణ చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే తాము సమ్మెలో ఉన్నందున కాలేజీలకు తాళాలు వేస్తామని, విచారణకు సహకరించలేమని ఫాతీ ముందుగానే ప్రకటించింది. ‘కాలేజీకి వస్తున్నాం.. రికార్డులు పరిశీలించాలి’ అంటూ విచారణ బృందాలు కాలేజీల యాజమాన్యాలను కోరుతుండగా.. కాలేజీలకు తాళాలు వేసి సమ్మెలో ఉన్నందున రికార్డులు ఇవ్వలేమని, విచారణకు సహకరించలేమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో విజిలెన్స్ విచారణ ప్రారంభం కాలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలను గత ప్రభుత్వం వేధించిందన్నారు. కాంగ్రెస్ సర్కారు సైతం అలాగే వ్యవహరించొద్దని కోరారు.
ఉన్నత విద్యామండలి వద్ద విద్యార్థుల ధర్నా
కార్వాన్: రీయింబర్స్ బకాయిలను విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు మంగళవారం ఉన్నత విద్యామండలిని ముట్టడించాయి. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ధర్నాకు దిగడంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్థుల ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మద్దతు తెలిపారు.