Share News

కలెక్టరేట్‌ శానిటేషన్‌ కార్మికుల నిరవధిక సమ్మె

ABN , Publish Date - May 22 , 2025 | 11:17 PM

పెండింగ్‌ వేతనా లు చెల్లించాలని కలెక్టరేట్‌ అవుట్‌ సోర్సింగ్‌ శానిటేషన్‌ సిబ్బంది నిరవ ధిక సమ్మెకు దిగారు.

కలెక్టరేట్‌ శానిటేషన్‌ కార్మికుల నిరవధిక సమ్మె
నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న కలెక్టరేట్‌ శానినేషన్‌ సిబ్బంది

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 22 (ఆంధ్యజ్యోతి) : పెండింగ్‌ వేతనా లు చెల్లించాలని కలెక్టరేట్‌ అవుట్‌ సోర్సింగ్‌ శానిటేషన్‌ సిబ్బంది నిరవ ధిక సమ్మెకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ గేటు వద్ద ఏ ర్పాటు చేసిన శిబిరంలో దీక్షలో కూ ర్చున్న వారికి సీఐటీయూ జిల్లా స హాయ కార్యదర్శి పొదిలరామయ్య పూలమాల లు వేసి నిరవధిక సమ్మెను ప్రారంభించారు. పొదిల రామయ్య మాట్లాడు తూ కలెక్టరేట్‌లోని శానిటేషన్‌ సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేద న వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి సిబ్బందికి జీతాలు చెల్లించేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, నాయకులు అంతటి కాశన్న, శివ, కలెక్టరేట్‌ శానిటేషన్‌ సిబ్బంది రిజ్విన్‌, నాగమణి, ఎల్లమ్మ, శ్రీదేవి, అలివేల, రేణుక, నాగయ్య పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:17 PM