ఆర్‌టీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ABN , Publish Date - Dec 04 , 2025 | 11:06 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి సమీ పంలో ఉన్న ఆర్‌టీవో కా ర్యాలయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
కందనూలు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి సమీ పంలో ఉన్న ఆర్‌టీవో కా ర్యాలయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఉద్యోగు ల హాజరు రిజిస్టర్‌ను పరిశీ లించిన ఆయన సిబ్బందితో మా ట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కా ర్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆన్‌లై న్‌లో అందిస్తున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లా డుతూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ, వాహనాల ఫిట్‌నెస్ మంజూరు, రోడ్డు సురక్షా ప్రమాణాల ప్రకారం వాహనాల తనిఖీలు వంటి రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలను పూర్తిగా నిబంధనలు, మార్గదర్శకాలు, చట్టపరమైన విధి విధానాలకు కట్టుబడి పారద ర్శకంగా, ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రవాణా శాఖ అధికారి చిన్నబాలునాయక్, ఆర్డీవో ఇన్‌స్పెక్టర్లు మహేష్, అనూప్‌రెడ్డి, రాజశేఖర్, మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.