kumaram bheem asifaba ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:36 PM
కెరమెరి మండలంలో గురువారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలిం చారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గురువారం నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు పంచాయతీలు ఏకగ్రీం కాగా మిగిలిన 29 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు గాను 234 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 400 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
కెరమెరి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలంలో గురువారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలిం చారు. పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గురువారం నిర్వహించే సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉండగా రెండు పంచాయతీలు ఏకగ్రీం కాగా మిగిలిన 29 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు గాను 234 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 400 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఏని మిది రూట్లుగా విభజించామని చెప్పారు. 250 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎంపీడీవో సురేష్‌కుమార్, ఎంపీవో సాయిరాంగౌడ్ ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
వాంకిడి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వాంకిడి మండలంలో గురువారం నిర్వహించే మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది తమకు విధులు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. మండలంలోని 28 పంచాయతీలకు గాను 25 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయని ఎంపీడీడో జోత్స్న అన్నారు. ఇందులో మూడు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మండలంలోని తేజాపూర్ పంచాయతీ ఎస్టీ రిజర్వషన్ రావడంతో అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేక సర్పంచుకు ఎన్నికలు జరుగడంలేదు. కేవలం నాలుగు వార్డు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో మండలంలో 25 పంచాయతీల్లో 209 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు . మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 28,595 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. మండల కేంద్రంనుంచి ఆయా గ్రామపంచాయతీలకు ఎన్నికల విధులకు వెళ్లే సిబ్బందికి వాహనాలు సమకూర్చారు. ఎన్నిక ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ సత్యనారాయణ, ఎస్సై మహెందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి):మండలంలో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి.మండలంలో మొత్తం 15 గ్రామ పంచాయితీలు సర్పచ్ పదవీ కోసం 51 మంది బరిలో ఉన్నారు.అదే విధంగా 124 వార్డు సభ్యులకు 98 మంది సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో 26 వార్డులకు ఎన్నికలకు 56 మంది వార్డు సభ్యులకు పోటిలో ఉన్నారు.