కానరాని తునికాకు సేకరణ
ABN , Publish Date - May 20 , 2025 | 11:35 PM
బీడీలకు ఉపయోగిం చే తునికాకు సేకరణ జిల్లాలో కనుమరుగవుతోంది. బీ డీలు తాగేవారి సంఖ్య జిల్లాలో గణనీయంగా తగ్గింది. జిల్లాలో నాలుగు అటవీ డివిజన్‌లు ఉండగా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల అభయారణ్యం పులులకు ఆవా సమైంది.
ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు
కాసిపేట, మే20(ఆంధ్రజ్యోతి): బీడీలకు ఉపయోగిం చే తునికాకు సేకరణ జిల్లాలో కనుమరుగవుతోంది. బీ డీలు తాగేవారి సంఖ్య జిల్లాలో గణనీయంగా తగ్గింది. జిల్లాలో నాలుగు అటవీ డివిజన్‌లు ఉండగా జన్నారం అటవీ డివిజన్, కవ్వాల అభయారణ్యం పులులకు ఆవా సమైంది. ఇక్కడ తునికాకు సేకరణ కాదు కదా అక్కడి నుంచి గడ్డిపోచకూడ బయటకు తీసుకపోవడానికి వీ లులేకుండా పోయింది. మిగితా మూడు డివిజన్లు చె న్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి అటవీ డివిజన్‌లో తు నికాకు సేకరణకు టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ఎవరు కూడ ఆసక్తి చూపకపోవడంతో ఆకుల కల్లాలు లేక గ్రా మాల్లో వెలవెల బోతున్నాయి. తునికాకు సేకరణ ఉని కికి ముప్పు వాటిల్లనుంది. వేసవిలో తునికాకు సేకర ణ ద్వారా ఉపాధిపొందే ఆదివాసీలు ఆకుసేకరణ లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. వేసవికాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లి అడ్డ కూలీలుగా పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపా ధి అవకాశాలను మెరుగుపరిచి ఆదివాసీలను ఆదుకో వాలని సంఘాలు కోరుతున్నాయి.
జిల్లాలో 9యూనిట్లలో ఆకుసేకరణ...
గతంలో జిల్లాలో తునికాకు సేకరణ 40 యూనిట్ల కుపైగా ఆకుసేకరణ జరిగేది కానీ మూడేళ్లుగా తునికా కు సేకరణ సరిగ్గా జరగడం లేదు. గత ఏడాది మంచి ర్యాల అటవీ డివిజన్‌లో ఆవడం, జైపూర్, మద్దికల్ యూనిట్లు నిర్వహించి 2700 స్టాండర్డ్ బ్యాగుల ఆకు సేకరణ లక్ష్యం విధిస్తే 2603 స్టాండర్డ్ బ్యాగులతోనే స రిపెట్టారు. అలాగే చెన్నూర్ అటవీ డివిజన్‌లో కన్నె పల్లి, బద్దంపల్లి, మైలారం, నీల్వాయి యూనిట్లకు 9300 స్టాండర్డు బ్యాగుల లక్ష్యం నిర్దేశించగా 9240 స్టాండర్డ్ బ్యాగుల ఆకుసేకరణ జరిగింది. బెల్లంపల్లి అ టవీ డివిజన్ పరిధిలో నార్వాయిపేట, కుశ్నపల్లి, వేమ నపల్లి యూనిట్లకు 600వేల స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇక్కడ 7564 స్టాండర్డ్ బ్యాగులు సేకరిం చి లక్ష్యాన్ని అఽధిగమించారు. ఈఏడాది మంచిర్యాల డి విజన్‌లో హాజీపూర్, ఆవడం యూనిట్లకు 1800 స్టాం డర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని విధించారు. చెన్నూర్ డివిజన్‌లో భీమారం, కన్నెపల్లి, వెంచపల్లి, మైలారం, నీల్వాయి యూనిట్లకు 8900 లక్ష్యం నిర్దేశించారు. బెల్లంపల్లి అట వి డివిజన్ పరిధిలో కుశ్నపల్లి, వేమనపల్లి యూనిట్లకు 4400 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏ డాది లక్ష్యాన్ని సాధిస్తారో వేచి చూడాల్సిందే.
ఉపాధి కోల్పోతున్న ఆదివాసీలు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు క్షేత్రం. ఆది వాసీలకు నిలయం. ఏ సీజన్‌లోనైన అటవీ ఉత్పత్తుల పై ఆధారపడి జీవించే ఆదివాసీలకు తునికాకు సేకరణ జిల్లాలో ప్రధాన ఆదాయ వనరు. కాని నేడు బహుళ జాతి కంపెనీలు అందుబాటులోకి రావడంతో బీడీ ఆ కులకు మార్కెట్‌లో ఆదరణ తగ్గిపోయింది. ఆదివాసీ ల ఉపాధిపై పుర్రెగుర్తు వెక్కిరిస్తుంది. మంచిర్యాల జి ల్లాలో 61వేల ఆదివాసీ జనాభ ఉండగా 80శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. ఎక్కు వ మంది వ్యవసాయం, అటవీ అఽధారిత ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆది వాసీ గిరిజనులకు వేసవిలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి.
ఆకుల సీజన్‌లో ఐదువేలకు పైగా సంపాదించుకునేవాళ్లం...
తుర్సుబాయి, లక్ష్మీపూర్
ఆకుల సీజన్ వచ్చిందంటే ఒక్కొక్కరు ఐదువేలకు తగ్గకుండా సంపాదించుకునేవాళ్లం. కాని మూడేళ్ల నుం చి ఆకులు కోస్తలేరు. ఉదయం అడవులకు వెళ్లి ఎండ కు దొరకకుండానే ఇంటికి వచ్చేవాళ్లం. ఇంటిలోని వా రందరూ ఆడుతుపాడుతూ పని చేసిన ఐదువేలు వ స్తుండేవి. ఆ తరువాత గవర్నమెంటువాళ్లు బోనస్ ఇ స్తుండే. గిరిజనులకు వేసవి సీజన్‌లో చేతినిండా పని దొరుకుతుండేది. ఇప్పుడు ఎలాంటి పని దొరుకుత లేదు.
గుత్తెదారులు ఆసక్తి చూపడం లేదు...
ఎ. సుభాష్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, లక్షెట్టిపేట
తునికాకు సేకరణను కొనుగోలు కోసం గుత్తెదారులు ఆసక్తి చూపడం లేదు. అలాగే అడవుల్లో తునికాకు కొర త కూడ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో ప్రతి ఏ టా తునికాకు సేకరణ తగ్గుతూ వస్తోంది. అవసరం ఉ న్న చోట తునికాకు యూనిట్లను ఏర్పాటు చేసి తుని కాకును కొనుగోలు చేస్తున్నాం. అందరికి ఉపాధి కల్పిం చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. లక్షెట్టిపేట రేంజ్ పరిధిలో హాజీపూర్‌లో తునికాకు యూనిట్ ఏర్పాటు చే శాం. నిర్దేశించిన స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యాన్ని చేరేందు కు తునికాకు కొనుగోలు చేస్తున్నాం.