Share News

kumaram bheem asifabad- కోల్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 10:20 PM

ఉద్యోగ క్రీడాకారులు కోల్‌ ఇండియా స్థాయి పోటీల్లో సత్తా చాటాలని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గోలేటిలోని భీమన్న స్టేడియంలో డిపార్టుమెంట్‌ క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు.

kumaram bheem asifabad- కోల్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటాలి
క్రీడాకారులతో జీఎం విజయభాస్కర్‌రెడ్డి

రెబ్బెన, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ క్రీడాకారులు కోల్‌ ఇండియా స్థాయి పోటీల్లో సత్తా చాటాలని జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం గోలేటిలోని భీమన్న స్టేడియంలో డిపార్టుమెంట్‌ క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్‌ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిందన్నారు. గెలిచిన వారు మరింత నైపుణ్యాన్ని పెంచుకోవాలని, ఓడిన వారు నిరుత్సాహ పడకుండా తప్పులను సవరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, ప్రాజెక్టు అధికారి నరేందర్‌, ఎస్‌ఓటు జీఎం రాజమల్లు, డీజీఎం మదీనాభాషా, హెచ్‌ఓడీ శ్రీనివాస్‌, ప్రశాంత్‌, అవినాష్‌, కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లిలోని గోలేటి గనులపై రక్షణ పక్షో త్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఎంవీటీసీ వద్ద రక్షణ పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి కొత్తగూడెం రక్షణ తనిఖీ కనీవనర్‌ కోటిరెడ్డి ఎంవీటీసీని పరివీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఒక తల్లిబిడ్డకు నడక ఎలా నేర్పిస్తుందో ఎంవీటీసీ కూడా అలాంటి మొదట గురువు అన్నారు. ప్రమాదాల నివారణలో పర్యవేక్షణ, నియంత్రణ, శ్రద్ధ, రక్షణ చర్యలు అన్ని తప్పని సరిగా పాటించాలని తెలిపారు. ఇంటి నుంచే రక్షణ పరికాలు ధరించి విధులకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా రక్షణ అధికారి రాజమల్ల, ఎంవీటీసీ మేనేజర్‌ మధుసూదన్‌, ఎం.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 10:20 PM