Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పథకం నిరుపేదలకు వరం

ABN , Publish Date - May 15 , 2025 | 11:57 PM

ముఖ్యమంత్రి సహా య నిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పథకం నిరుపేదలకు వరం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్న శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి

సీఎంఆర్‌ఎఫ్‌ పథకం నిరుపేదలకు వరం

శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండరూరల్‌, మే 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సహా య నిధి పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కా ర్యక్రమంలో 37 మందికి సీ ఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భం గా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సంవత్సరానికి సుమారు రూ.1000 కోట్లకు పైన నిధులు మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇది నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందని అన్నారు. పార్టీలకతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌ పథకం ఇవ్వడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు నిధులు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 15 , 2025 | 11:57 PM