సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:51 PM
సీఎం ఆర్‌ఎఫ్ పేదలకు వరంలాంటిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : సీఎం ఆర్‌ఎఫ్ పేదలకు వరంలాంటిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వ కుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ఆదివారం బాఽధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే కార్పొరేట్ ఆసు పత్రిలో వైద్యం చేయించుకుంటే సీఎం ఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందజే స్తామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుప త్రులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు ఉన్నారు.