CMR Shopping Mall Inaugurated: మియాపూర్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్
ABN , Publish Date - Sep 11 , 2025 | 05:19 AM
సీఎంఆర్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్ మియాపూర్‌లో..
ప్రారంభించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
జ్యోతి ప్రజ్వలన చేసి నటి మృణాల్ ఠాకూర్
మాకిది 41వ షాపింగ్‌మాల్: అధినేత వెంకట రమణ
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల ప్రకటన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సీఎంఆర్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్ మియాపూర్‌లో ప్రారంభించింది. ఈ షాపింగ్‌మాల్‌ను బుధవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించగా, నటి మృణాల్ ఠాకూర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్, స్థానిక కాంగ్రెస్ నాయకులు మాధవరం జగదీశ్వరరావు, సీఎంఆర్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మావూరి వెంకటరమణ, బాలనటుడు రేవంత్(బుల్లిరాజు) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఇంటిల్లిపాదికీ నచ్చే నాణ్యమైన వస్త్రాభరణాలను అతి తక్కువ ధరలలో అందించడం ద్వారా తెలుగు రాష్ట్రాలలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రాచుర్యం పొందిందన్నారు. మావూరి వెంకటరమణ మాట్లాడుతూ.. మియాపూర్ క్రాస్‌రోడ్స్ వద్దనే తమ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇది తమ 41వ షాపింగ్ మాల్ అని చెప్పారు. ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లను తీసుకురావడంతో పాటు బంగారం ఆభరణాలపై వాల్యూ ఎడిషన్ ఫ్లాట్ 9ు అందిస్తున్నామన్నారు. నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ సీఎంఆర్‌తో తన అనుబంధం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.