Share News

CM Revanth Reddy entertained and engaged citizens: సామెతలతో ఆకట్టుకున్న రేవంత్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 05:29 AM

సీఎం రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌ బహిరంగ సభలో సర్పంచ్‌లను ఎన్నుకునే విషయంపై పలు సామెతలు చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు....

CM Revanth Reddy entertained and engaged citizens: సామెతలతో ఆకట్టుకున్న రేవంత్‌

హుస్నాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌ బహిరంగ సభలో సర్పంచ్‌లను ఎన్నుకునే విషయంపై పలు సామెతలు చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు. ‘‘మనకు సుట్టం ఉంటే ఉండవచ్చు. కానీ.. ఏడ బావా అన్న సరేగానీ వంకాయ తోట కాడ బావా అనొద్దని ఎనుకటి పెద్దోళ్ళు చెప్పిండ్రు. ఇంకా ఒగడొగడు ఉంటడు. మూడెడ్లకు 33 దొడ్లు ఉన్నాయని కొంకణాలు చెప్పెటోడు వస్తడు.. ఇట్లంటోళ్ళను సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా చేసినట్లయితే బుద్దిమంతుడని సద్ది కడితే సక్కగా బొడ్రాయి కాడ బోజనం చేసి ఇంకేమి పెడుతరు అని అంటరు’’ అని నవ్వులు పూయించారు. గ్రామాలకు వెలుగులు నింపే వారిని ఎన్నుకోవాలని, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి గ్రామానికి నిధులు తెచ్చేవారిని ఎన్నుకోవాలని సూచించారు.

Updated Date - Dec 04 , 2025 | 05:29 AM