CM Revanth Reddy: రెండో రోజూ ఢిల్లీలోనే సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:31 AM
ఓట్ చోర్ గద్దీ ఛోడ్ మెగా ర్యాలీ కోసం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజూ ఇక్కడే గడిపారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు...
న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ్’ మెగా ర్యాలీ కోసం ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజూ ఇక్కడే గడిపారు. సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే పొంగమంచు కారణంగా అనేక విమానాలు ఆలస్యంగా నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం రేవంత్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. సోమవారమంతా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే కుటుంబ సభ్యులతో రేవంత్ గడిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ బయలుదేరనున్నారు.