Share News

CM Revanth Reddy: రేపు 2 జిల్లాల పర్యటనకు సీఎం

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:51 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు..

CM Revanth Reddy: రేపు 2 జిల్లాల పర్యటనకు సీఎం

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భద్రాద్రి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిసింది. కాగా 4వ తేదీన కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం.

Updated Date - Sep 02 , 2025 | 02:51 AM