CM Revanth Reddy: రేపు ఓయూకు సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:14 AM
ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఈమేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు...
ఆర్ట్స్ కళాశాల వద్ద భారీ బహిరంగ సభ
ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ దేవసేన, వీసీ, ఏసీపీ
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 10న సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఈమేరకు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సోమవారం సభ ఏర్పాట్లను కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఓయూ ఉప కులపతి కుమార్ మొలుగరం, ఏసీపీ జగన్, సీఐ అప్పలనాయుడు పరిశీలించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేలమంది కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పర్యటనలో రూ.వెయ్యి కోట్ల నిధులతో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మరి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.