Share News

Nallakunta Shankar Math: సీఎం రేవంత్‌కు విధుశేఖర భారతీస్వామి ఆశీస్సులు

ABN , Publish Date - Oct 29 , 2025 | 04:41 AM

ధర్మవిజయ యాత్రలో భాగంగా హైదరాబాద్‌లోని నల్లకుంట శంకరమఠానికి వచ్చిన శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామిని...

Nallakunta Shankar Math: సీఎం రేవంత్‌కు విధుశేఖర భారతీస్వామి ఆశీస్సులు

  • వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి

రాంనగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ధర్మవిజయ యాత్రలో భాగంగా హైదరాబాద్‌లోని నల్లకుంట శంకరమఠానికి వచ్చిన శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామిని సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు మంగళవారం ఉదయం కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సంప్రదాయ దుస్తులలో స్వామి వద్దకు వెళ్లిన సీఎం రేవంత్‌.. వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు వివరించారు. అలాగే.. శంకరమఠంలో జరిగిన పలు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శంకరమఠం పూజారులు ఆయనకుఆశ్వీరచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - Oct 29 , 2025 | 04:43 AM