CM Revanth Reddy Praises Congress: ప్రజాస్వామ్యం కోసం పురుడు పోసుకున్న కాంగ్రెస్
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:56 AM
దేశ విముక్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పురుడు పోసుకున్న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) 140 ఏళ్ల మైలురాయిని అధిగమించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
‘ఎక్స్’లో సీఎం రేవంత్ పోస్టు
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశ విముక్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పురుడు పోసుకున్న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) 140 ఏళ్ల మైలురాయిని అధిగమించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆనాడు ఇదే రోజు ఒక శక్తిగా ఆవిర్భవించిన కాంగ్రెస్ ప్రస్థానం.. అచ్చంగా భారత ప్రజాస్వామ్య గమనాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె రాజకీయ ప్రస్థానంలో సేవ, నిబద్ధత, నైతిక విలువలు అంతర్భాగమని కొనియాడారు. పీవీ, మన్మోహన్‌ల ఎదుగుదల ఆమె ఘనతేనని.. సోనియా తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లే దేశానికి గొప్ప నాయకత్వం లభించిందన్నారు. ‘తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నుంచి సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన పీవీని దేశ ప్రధానిగా చూసే అవకాశం సోనియా నాయకత్వంలోనే సాధ్యమైంది. అలాగే గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసి దేశాభివృద్ధికి కొత్త బాటలు వేశారు’ అని పేర్కొన్నారు.