Minority Reservation: మైనార్టీలకు రిజర్వేషన్ల సాధనలో షబ్బీర్ అహ్మద్ కృషి భేష్
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:29 AM
మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ల సాధనలో దివంగత ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు....
మాజీ ఎమ్మెల్సీ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం రేవంత్
పహాడిషరీ్‌ఫ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ల సాధనలో దివంగత ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ చేసిన కృషి మరువలేనిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్‌పల్లి మున్సిపాలిటీలోని షాహిన్‌నగర్‌లో ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అహ్మద్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. షబ్బీర్ అహ్మద్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ జమైతుల్ ఉలేమా హింద్ ప్రతినిధిగా ఉంటూ హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా మాజీ ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను పరామర్శించారు.