Medical Update: సీఎం అత్త పారిజాతమ్మకు అస్వస్థత
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:34 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్త పారిజాతమ్మ తీవ్ర అస్వస్థతతో బుధవారం మాదాపూర్ హైటెక్‌సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో చేరిక.. ఐసీయూలో చికిత్స
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్త పారిజాతమ్మ తీవ్ర అస్వస్థతతో బుధవారం మాదాపూర్ హైటెక్‌సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనరీ యాంజియోగ్రామ్ నిర్వహించి గుండెలో పెద్దగా అడ్డంకులు లేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి సున్నితంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందిస్తునట్లు డాక్టర్లు తెలిపారు.