CM Revanth Reddy met AICC chief Mallikarjun Kharge: ఖర్గేను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:12 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఖర్గేకు వైద్యులు సర్జరీ ద్వారా పేస్ మేకర్‌ను అమర్చారు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్లపైనా చర్చ
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఖర్గేకు వైద్యులు సర్జరీ ద్వారా పేస్ మేకర్‌ను అమర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బెంగళూరు వెళ్లిన సీఎం.. ఖర్గేను పరామర్శించారు. అయితే ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలూ చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా బెంగళూరు వెళ్లి ఖర్గేను పరామర్శించారు. బీసీ రిజర్వేషన్‌పై వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ అనంతరం.. ఢిల్లీ నుంచి వారు నేరుగా బెంగళూరు వెళ్లి ఖర్గేను కలిశారు.