CM Revanth Reddy: భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:04 AM
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్‌రెడ్డి...
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్‌రెడ్డి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.