Share News

Medak Church: క్రైస్తవులకు సీఎం రేవంత్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:32 AM

క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు.

Medak Church: క్రైస్తవులకు సీఎం రేవంత్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తూ, రాష్ట్రంలోని అన్ని మతాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పా రు. ముఖ్యంగా క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. వేడుకలను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

మెదక్‌ చర్చికి క్రిస్మస్‌ వెలుగులు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమైంది. రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేయడంతో కొత్త కాంతులతో మెరిసిపోతోంది. ఈ చర్చి నిర్మించి గతేడాది వందేళ్లు పూర్తి చేసుకోగా, ఈ క్రిస్మస్‌తో 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గురువారం ప్రాతఃకాల ప్రార్థనలతో (ఉదయం 4:00 గంటలకు) చర్చిలో వేడుకలు ఘనంగా ప్రారంభంకానున్నాయి. క్రిస్మస్‌ నుంచి మొదలుకొని నూతన సంవత్సర వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగనున్నాయి. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

- మెదక్‌ కల్చరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 25 , 2025 | 05:32 AM