TSquare: ఐకానిక్ భవనంలా టీస్క్వేర్
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:39 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీస్క్వేర్‌ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్‌లా నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి...
అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాలి
వచ్చే నెలాఖరు కల్లా పనుల ప్రారంభం
అద్భుతమైన మాల్ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీస్క్వేర్‌ను అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించేలా ఐకానిక్ బిల్డింగ్‌లా నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని ఐటీ ప్రాంతమై న రాయదుర్గంలో అత్యంత ఆకర్షణీయంగా దీని నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు కొత్త పబ్లిక్ డెస్టినేషన్‌గా నిలవాలన్నారు. ఇందు కు సంబంధించిన కొన్ని డిజైన్‌లను అధికారులు సీఎంకు చూపించగా.. వాటికంటే మెరుగైనదిగా, రాబోయే డిజిటల్ యుగానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉండేలా సృజనాత్మక డిజైన్‌తో తీర్చిదిద్దాలని సూచించారు. శనివారం ఐసీసీసీ (ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్)లో వి-హబ్, ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీస్క్వేర్‌ను ఎంటర్‌టైన్‌మెంట్, టూరిజం, ఫుడ్, బిజినె్‌సల కలయికగా అద్భుతమైన మాల్ కాంప్లెక్స్‌గా రూపుదిద్దాలన్నారు. ఈ మాల్ 24 గంటలూ అందుబాటులో ఉండే ప్రదేశంగా మారాలన్నారు. పెద్ద పెద్ద ఎలకా్ట్ర నిక్ డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రకాశవంతమైన లైటింగ్‌తో ఈ ప్రాంతాన్ని మిరుమిట్లు గొలిపే చైతన్యవంతమైన వేదికగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. నిర్మాణ పనులు నవంబరు నెలాఖరుకల్లా ప్రారంభమయ్యేలా చర్య లు తీసుకోవాలన్నారు. దానికోసం అవసరమైన జైకా ఫండింగ్ త్వరగా పొందేలా సమన్వయం చేయాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన ఆపిల్ వంటి కంపెనీలు కూడా టీస్క్వేర్ ప్రాజెక్టులో భాగమయ్యేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా పార్కింగ్ సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా డిజైన్‌లో పొందుపరచాలని సూచించారు.
ఏఐ హబ్‌తో ప్రాజెక్టులన్నీ ఒకే వేదిక పైకి..
రాష్ట్రంలోని అన్ని ఏఐ స్టార్ట్‌పలు, సెంటర్లు, ప్రాజెక్టులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ‘ఏఐ ఇన్నోవేషన్ హబ్’ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరంలో ఏర్పాటు చేయబోయే ఏఐ హబ్ ప్రణాళికలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రపంచ స్థాయి కంపెనీలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీ య ఏఐ కేంద్రాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐలో నైపుణ్యం కలిగిన ప్రపంచ ప్రఖ్యా త సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏఐ ఆధారిత ఇన్నోవేషన్‌ను ప్రో త్సహించేందుకు ప్రత్యేక ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్’ ఏర్పాటు అవసరమన్నారు. 2024నుంచి తమ ప్రభు త్వం ఏఐ రంగంలో అనేక పథకాలు చేపట్టిందన్నా రు. అందులో గ్లోబల్ ఏఐ సమ్మిట్, ఏఐ సిటీ ప్రాజెక్ట్ ప్లాన్, తెలంగాణ ఏఐ రైజింగ్ గ్రాండ్ చాలెంజ్, ఏఐ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ముఖ్యమైనవని తెలిపారు.
నేడు తుంగతుర్తికి సీఎం రేవంత్
తుంగతుర్తి: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి రానున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సంతాప సభ సభకు సీఎం హాజరు కానున్నారు. సీఎంతోపాటు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రానున్నారు.