Share News

CM Revanth Reddy Consoles MLA Bhupathi Reddy: ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం పరామర్శ..

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:02 AM

నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. భూపతిరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ ఇటీవల కన్నుమూయగా..

CM Revanth Reddy Consoles MLA Bhupathi Reddy:  ఎమ్మెల్యే భూపతిరెడ్డికి సీఎం పరామర్శ..

నిజామాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. భూపతిరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ ఇటీవల కన్నుమూయగా.. నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో శుక్రవారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూపతిరెడ్డి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క, సీఎం సలహాదారుడు వేంనరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 03:18 AM