BC Commission Chairman: రేవంత్ రెడ్డి శకుని లాంటి సీఎం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:23 AM
మహాభారతంలో కౌరవులను సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న శకుని లాగా తెలంగాణలో బీసీ జాతిని సర్వనాశనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని...
అగ్రకులానికి ఓటు వేయనని బీసీలంతా ప్రమాణం చెయ్యాలి
జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్
పంజాగుట్ట, ఆక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో కౌరవులను సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న శకుని లాగా తెలంగాణలో బీసీ జాతిని సర్వనాశనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య గౌడ్ ఆరోపించారు. శకుని లాంటి సీఎం మనకు దొరికాడంటూ ధ్వజమెత్తారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు- న్యాయవివాదాలు పరిష్కారం’ అంశంపై బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన సదస్సులో ఈశ్వరయ్య గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలకు సంబంధించి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం అంశాన్ని కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకోవడం లేదని ఈశ్వరయ్య గౌడ్ ఆరోపించారు. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్ట బద్థత ఉంటుందని అన్నారు.