CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో ప్రచారానికి సీఎం రేవంత్
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:28 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించే ...
రేపు యూస్‌ఫగూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సభ
30, 31న.. నవంబరు 4, 5 తేదీల్లో రోడ్‌షోలు!
ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న ఆయన.. స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని యూస్‌ఫగూడ పోలీ్‌సగ్రౌండ్స్‌లో ఈ నెల 28న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, 24 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి అభినందన సభ జరగనుంది. ఆయనతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావునూ సన్మానించనున్నారు. ఆ సభలో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 30, 31 తేదీల్లోను మళ్లీ నవంబర్ 4, 5 తేదీల్లోనూ ఆయన రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీటికి మధ్యలో బిహార్ ఎన్నికల ప్రచారానికీ ఆయన వెళ్లనున్నట్లు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనకు ఈ ఉప ఎన్నిక కొలమానంగా మారడం, ఇక్కడ గెలిస్తే దాని ప్రభావం జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా పడే అవకాశమున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.