CM tulabharam: సీఎం తులాభారం..
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:12 AM
మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి సుమారు రెండున్నర గంటలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం..
68 కిలోల బంగారం సమర్పణ
మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి సుమారు రెండున్నర గంటలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవటంతో 25 నిమిషాల ఆలస్యంగా వచ్చారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి.. ముందుగా మేడారం జాతర ప్రాంతాన్ని హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు. అక్కడి నుంచి నేరుగా సమ్మక్క-సారలమ్మ ఆలయానికి చేరుకొని తులాభారం వేశారు. రేవంత్‌రెడ్డి 68 కిలోల బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. సీఎంకు ఆదివాసీ కళా నృత్యాలతో దేవస్థానం ప్రధాన ముఖద్వారం నుంచి పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ గద్దెలకు చేరుకొని తల్లులను రేవంత్ దర్శించుకున్నారు. గద్దెలతో పాటు ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీలు, గిరిజనులు, పూజారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు హైదరాబాద్‌కు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.