Central Minister Kiren Rijiju: కనీసం ఫుట్‌బాల్‌ను ఆపలేకపోయారు
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:55 AM
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కోల్పోయారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.....
రేవంత్ రెడ్డి సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు
బాల్ పాస్ సరిగా లేక మెస్సీ పరుగెత్తాల్సి వచ్చింది: రిజిజు
హైదరాబాద్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని కోల్పోయారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మెస్సీతో ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సీఎం, మెస్సీ మ్యాచ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరు ఆడిన వీడియోను కేంద్రమంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మెస్సీ లాంటి ఆటగాడితో మ్యాచ్ కోసం సీఎం సరిగా సన్నద్ధం కాలేకపోయారు. కనీసం ఫుట్‌బాల్‌ను ఆపలేకపోయారు. మెస్సీకి సరిగా బాల్ పాస్ చేయకపోవడంతో మెస్సీ అటూఇటూ పరుగెత్తాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.