CM Revanth Heads to Patna: పట్నాకు సీఎం రేవంత్ పయనం
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:11 AM
బిహార్ రాజధాని పట్నాలో బుధవారంనాడు జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లా...
టీపీసీసీ చీఫ్ సైతం
హైదరాబాద్ : బిహార్ రాజధాని పట్నాలో బుధవారంనాడు జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) విస్తృత సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, సీడబ్ల్యుసీ శాశ్వత ఆహ్వానితులు మీనాక్షి నటరాజన్, దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి పాల్గొంటారు.
26న ఏటీసీ కేంద్రాల్ని ప్రారంభించనున్న సీఎం
హైదరాబాద్‌లోని మల్లెపల్లి ఐటీఐతోపాటు వివిధ ఐటీఐల్లో నిర్మించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ఈ నెల 26న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ఏటీసీల ప్రారంభానికి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఒక ఎకరం విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా టెక్నాలజీస్ సంయుక్తంగా ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నాయి.