Share News

CM Revant Reddy: నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో నేడు సీఎం పర్యటన

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:53 AM

సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ పట్టణాల్లో సోమవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో నేరుగా...

CM Revant Reddy: నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో నేడు సీఎం పర్యటన

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆత్మకూరు/నారాయణపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ పట్టణాల్లో సోమవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో నేరుగా హైదరాబాద్‌ నుంచి ఆత్మకూరులోని జాతర మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకోనున్నారు. అనంతరం 1:20 గంటలకు పీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కృష్ణానదిపై జూరాల దిగువన వంతెన నిర్మాణానికి, 50 పడకల ఆస్పత్రి, ఇండోర్‌ స్టేడియం నిర్మాణం, రూ.15 కోట్ల వ్యయంతో మునిసిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ మునిసిపాలిటీలో రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు, మక్తల్‌-నారాయణపేట మధ్య రూ.210 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్‌లోని నారాయణపేట రోడ్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను నారాయణపేట కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ వినీత్‌లతో అధికారుల బృందం పరిశీలించింది. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 05:53 AM