ఆలయ అభివృద్ధిపై సీఎంకు పట్టింపులేదు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:15 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి పట్టింపులేదని బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పాపట్ల నరహరి విమర్శించారు.
యాదగిరిగుట్ట రూరల్, నవంబరు 9,(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి పట్టింపులేదని బీఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పాపట్ల నరహరి విమర్శించారు. గుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి గత సంవత్సరం స్వామివారి దర్శించుకొని ఆలయ అధికారులతో పెండింగ్ పనులపై సమీక్షసమావేశం నిర్వహించి వెంటనే పెండింగ్ పనులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి ఏడాది గడిచినా పైసా కేటాయించలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి రూ. 1300 కోట్లు కేటాయించి ప్రపంచం అబ్బురపడే విధంగా తీర్చిదిద్దారన్నారు. కొండపై కల్యాణ మండపం, సంగీత భవనం, కొండకింద షాపింగ్‌పనులు, పెండింగ్ పనులు పూర్తి చేయించకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పట్టణ కార్యదర్శులు పేరబోయిన సత్యనారాయణ, ఆరే శ్రీధర్‌గౌడ్, మాటూరి బాలయ్యగౌడ్, గడ్డం చంద్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.