Share News

kumaram bheem asifabad- మూతపడ్డ దాల్‌మిల్లులు

ABN , Publish Date - Sep 30 , 2025 | 10:22 PM

జిల్లాలో ఏర్పాటు చేసిన దాల్‌మిల్లులు అధికారులు పట్టించు కోక పోవడంతో మూతపడ్డాయి. జిల్లాలో గిరిజన మండలాల రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులకు విక్రయించి నష్టపో వల్సిన పరిస్థితి ఉంటుంది.

kumaram bheem asifabad- మూతపడ్డ దాల్‌మిల్లులు
నిరుపయోగంగా మిల్లులోని యంత్రాలు

- పట్టించుకోని అధికారులు, మహిళాసంఘాలు

వాంకిడి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏర్పాటు చేసిన దాల్‌మిల్లులు అధికారులు పట్టించు కోక పోవడంతో మూతపడ్డాయి. జిల్లాలో గిరిజన మండలాల రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులకు విక్రయించి నష్టపో వల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేనపథ్యంలో కంది, జొన్న సాగుచేసుకునే గిరిజన రైతులను ఆదుకోవా లన్న ఉద్దేశంతో వన బంధు కల్యాణ యోజన పథకం కింద సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని వాంకిడి, తిర్యణి మండలాల్లో గత ప్రభుత్వం దాల్‌మిల్లు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణతో గిరిజన రైతు లకు గిట్టుబాటు ధర లభించగా మరోవైపు మహిళా ఉత్పత్తిదారు సంఘాలకు వాటా రుపేణా లాభాలు అందాయి. దాల్‌మిల్లులు కొన్నేళ్ల పాటు మంచి ఫలి తాలు ఇవ్వగా అనంతరం వీటి నిర్వహణను అధికా రులు పట్టించుకోకపోవడంతో మిల్లులు మూతపడ్డా యి. ఫలితంగా రైతు, మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లేకుండా పోతుంది.

- ఐటీడీఏ పీవో చొరవతో..

గిరిజన మహిళా సంఘాలను బలోపేతం చేయా లనే సంకల్పంతో అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్‌ దాల్‌మిల్లుల ఏర్పాటుకు కృషి చేశారు. 2017లో వాంకిడి, తిర్యాణి మండల కేంద్రాల్లో రూ. 7.80 లక్షలతో మినీ దాల్‌మిల్లు కేంద్రాలను ఏర్పాటు చేశా రు. వాంకిడిలో దాల్‌మిల్లుతో పాటు అదనంగా జొన్నపిండి, రవ్వ, తయారు చేసేందుకు రూ. 4 లక్షలతో యంత్రాలను ఏర్పాటు చేశారు. కెరమెరి మండలంలో ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో కందులు కోనుగోలుచేపట్టారు. ఇక్కడ కొనుగోలు చేసిన కందులను వాంకిడి దాల్‌మిల్లులో పప్పు తయారు చేసి విక్రయించేవారు. తయారు చేసిన పప్పులను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసే వారు. ఇప్పటికీ ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసిన పప్పుకు సంబంధించిన డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

- అధికారుల పర్యవేక్షణ లేక

కొన్నాళ్లపాటు దాల్‌ మిల్లులు లాభాల బాటలో నడవగా మహిళా సంఘాలకు సైతం లాభాల వాటా అందేది. క్రమేణా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కింది స్థాయి అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారించడంతో అవి నష్టాల బారిన పడ్డాయి. దీంతో మూడేళ్ల నుంచి యంత్రాలు మూ లన పడి తుప్పుపట్టాయి. ఉన్నతాధికారులు సైతం చొరవ చూపక పోవడంతో ఆయా మండలా ల్లో కం దుల కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా రూ. లక్షల విలువైన యంత్రాలు నిరుప యోగంగా మారాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి దాల్‌ మిల్లులను పునః ప్రారంభిస్తే ఉపాధి లభిస్తుంద ని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు.

పునఃప్రారంభించే లా చర్యలు..

- కోనయ్య ఏపీఎం, ఇందిరాక్రాంతి పథకం

పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. వాంకిడి మండలానికి ఏపీఎంగా ఇటీవలే బదిలీపై వచ్చాను. దాల్‌ మిల్లులు పనిచేయడం లేదని తెలి సింది. దాల్‌ మిల్లును పరిశీలించాం. దాల్‌ మిల్లులు ప్రారంభంలో లాభాల బాటలో నడిచాయి. క్రమేణా నష్టాల బారిన పడ్డాయి. మూడేళ్ల నుంచి దాల్‌మి ల్లుల నిర్వహణ కొనసాగడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.

Updated Date - Sep 30 , 2025 | 10:22 PM