క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:40 PM
క్లినికల్ ఎస్టాబ్లి ష్మెంట్ చట్టం మార్గదర్శకాలను, ని బంధనలు పాటించాలని జిల్లా వై ద్యారోగ్యశాఖ అధికారిడాక్టర్ కే.రవి కుమార్ అన్నారు.
- డీఎంహెచ్‌వో కే.రవికుమార్
కందనూలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : క్లినికల్ ఎస్టాబ్లి ష్మెంట్ చట్టం మార్గదర్శకాలను, ని బంధనలు పాటించాలని జిల్లా వై ద్యారోగ్యశాఖ అధికారిడాక్టర్ కే.రవి కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విహానా స్కానిం గ్ సెంటర్, ప్రజా నర్సింగ్ హోం, శ్రీదేవి సీటీ స్కానింగ్ సెంటర్, రు ద్రడెంటల్ క్లినిక్, బాలాజీ డయా గ్నోస్టిక్ సెంటర్, కృప ఫిజియోథెరపి సెంటర్లను డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ ఫెసిలిటీస్‌లో బయట ప్రదర్శించిన రేట్ల పట్టిక ప్రకారం మాత్రమే ఫీజులు వసూలు చే యాలని, వారందిస్తున్న సేవలు, రోగుల వివరా లు, రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించిన గర్భీణీల వివరాలను తెలుసుకున్నారు. ఎవరైనా స్కానింగ్ పరీక్షలు నిర్వహించి లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల్‌చారి, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ పాల్గొన్నారు.