Share News

కక్షిదారులు న్యాయ సేవా సంస్థ సేవలను వినియోగించుకోవాలి..

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:04 AM

లోక్‌ అధాలత్‌లో కేసు లు పరిష్కరించేందుకు కక్షిదారులు ఇరు పక్షాల వారు న్యాయ సేవా సంస్థ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య అన్నారు.

కక్షిదారులు న్యాయ సేవా సంస్థ సేవలను   వినియోగించుకోవాలి..

మంచిర్యాల క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): లోక్‌ అధాలత్‌లో కేసు లు పరిష్కరించేందుకు కక్షిదారులు ఇరు పక్షాల వారు న్యాయ సేవా సంస్థ సేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య అన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో జాతీ య లోక్‌ అదాలత్‌ గురించి జిల్లా న్యాయస్థాన సమన్వయ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థాన ఆదేశాల ప్రకారం ఈ నెల 21 ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేట న్యాయ స్థానాలలో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తామని తెలిపారు. మోటర్‌వాహన నష్ట పరిహారం, ఎన్‌ఐ యాక్టు, క్రిమినల్‌ కేసులు, సివిల్‌ దావాలు పరి ష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయ మూర్తి లాల్‌ సింగ్‌, శ్రీనివాస్‌ నాయక్‌, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎ నిర్మల, డీసీపీ భాస్కర్‌, అడిషనల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జి రాంమోహన్‌రెడ్డి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత, నిరోశ, ఎక్సైజ్‌ మెజిస్ట్రేట్‌ కృష్ణ తేజ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, ఉన్నతాధికారులు, సిబ్బంది, ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 12:04 AM