ఇక పక్కాగా హద్దులు
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:01 PM
భూ సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ ట్టాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే రిజి స్ట్రేషన్-మ్యూటేషన్ సమయంలోనే భూమి నక్షా జత చే యడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అవసరమై న మ్యాపుల రూపకల్పనకు, భూధార్ కార్డుల జారీకి ఎం జాయ్‌మెంట్ సర్వే చేసేందుకు పెద్ద ఎత్తున సర్వేయ ర్లు కావాలి. అందుకు సరిపడా ప్రభుత్వ సిబ్బంది లేక పోవడంతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు వినియోగించు కోనున్నారు.
-సర్వే నంబర్ల వారిగా భూముల మ్యాపింగ్
-జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రీసర్వే
-రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సమయంలోనే నక్షా రెడీ
-భూధార్ కార్డుల కోసం ఎంజాయ్‌మెంట్ సర్వే
-లైసెన్స్‌డ్ సర్వేయర్లతో కొలతలు, హద్దులు
నెన్నెల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): భూ సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ ట్టాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే రిజి స్ట్రేషన్-మ్యూటేషన్ సమయంలోనే భూమి నక్షా జత చే యడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అవసరమై న మ్యాపుల రూపకల్పనకు, భూధార్ కార్డుల జారీకి ఎం జాయ్‌మెంట్ సర్వే చేసేందుకు పెద్ద ఎత్తున సర్వేయ ర్లు కావాలి. అందుకు సరిపడా ప్రభుత్వ సిబ్బంది లేక పోవడంతో లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు వినియోగించు కోనున్నారు. జిల్లాలో 99 మంది అర్హులను గుర్తించి వా రికి రెండు సార్లు శిక్షణనిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి చే తుల మీదుగా ఇటీవల వారందరు లైసెన్స్‌డ్ సర్వేయ ర్లుగా దృవీకరణ పత్రాలు కూడా అందుకున్నారు. త్వర లో వారి సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిజి స్ట్రేషన్ చేసే భూములకు కొత్త నక్షాలతో పాటు వీరి సా యంతో జిల్లాలో పూర్తి స్థాయి రిసర్వే నిర్వహించను న్నారు. పూర్తిస్థాయి సర్వే కోసం పైలెట్ ప్రాజెక్టుగా జి ల్లాలో 12 గ్రామాలను ఎంపిక చేశారు. ఆధునిక పద్ధ తులతో కొలతలు చేపట్టి హద్దులు గుర్తించి గ్రామకం ఠం, అటవీ, సర్కారు తదితర భూములతో పాటు వ్య యసాయ భూములను సర్వే నంబర్ల వారిగా నక్షా, టి ప్పన్ రూపొందించనున్నారు. దీంతో భవిష్యత్తులో భూ మికి సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తే అవకా శం ఉండదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వ హించడానికి అవకాశం ఉటుంది.
దశాబ్ధాలుగా సమస్యలు..
జిల్లాలో పట్టా భూములతో పాటు పోడు భూము లు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ భూములు ఉన్నా యి. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూవివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు ప్రభు త్వ భూమి అంటూ అసైన్డ్ చేసి పట్టాలు జారీ చే స్తుండగా, ఆ భూములు రిజర్వు ఫారెస్టుకు చెందినవి అంటూ అటవీశాఖ అధికారులు సాగును అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు. రెవెన్యూ, ఫారెస్టు శా ఖలు జాయింట్ సర్వే నిర్వహించాలనే డిమాండ్ దశా బ్దాల నుంచి ఉంది. ఇంతే కాకుండా భూభారతి చట్టం అమలు కోసం ఇటీవల నిర్వహించిన రెవెవ్యూ సదస్సు ల్లో మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు వం టి అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రజావాణిలో భూస మస్యలపై పదుల సంఖ్యలో వినతి పత్రాలను అంది స్తూనే ఉన్నారు. భూములు, గ్రామాల రీసర్వేతో సమ స్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని అధి కారులంటున్నారు.
-ఇక పకడ్బందీగా..
ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం లాంటి వివరాలతో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతు న్నాయి. ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ఆధారంగా రిజి స్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయి లో భూమి వివరాలు ఏంటనేది తెలియడం లేదు. లై సెన్స్‌డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే మ్యాప్‌తో రి జిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ సమాచారం అ క్కడ సర్వేయర్‌కు వెలుతుంది. ఆ భూమిని సర్వే చేసి అందుకు తగ్గట్టు మ్యాప్ సిద్ధం చేసి మండల సర్వేయ ర్‌కు అందజేస్తారు. ఆయన దాన్ని పరిశీలించి దృవీక రి స్తారు. అనంతరం ఆ నక్షా ఆధారంగా రిజిస్ట్రేషన్- మ్యూటేషన్ ప్రక్రియను తహసీల్దార్ రిజిస్టర్ చేస్తారు.
-12 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు
రెవెన్యూలో అధిక శాతం సర్వేతో అనుసంధానమైన సమస్యలు ఉన్నాయి. సరిహద్దులు సరిగ్గా లేక పోవ డంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. జిల్లాలో వి విధ రెవెన్యూ గ్రామాలకు సంబధించిన సరైన మ్యాపులు అఽధికారుల వద్ద లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని గ్రామాలకు పూర్తిగా నక్షాలే లేవు. భూ పట్టాలు లేని గ్రామా లకు నక్షాలు రూపొందించడంతో పాటు, సర్వే నంబర్ల వారిగా టీపన్‌లు రూ పొందించాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే నక్షాలు లేని గ్రామాల్లో రిసర్వే నిర్వహించి కమతాల వారిగా హద్దులు నిర్ణయించనున్నా రు. సరిహద్దులు పక్కాగా తేల్చేందుకు ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో రీ సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని చిన్నవెంకటాపూర్, తంగ ళ్లపల్లి, రాంపూర్, కొత్తపల్లి, పుప్పాల్‌వానిపేట, అడ్క పల్లి, కిష్టంపేట, కవర్ కొత్తపల్లి, పార్‌పెల్లి, మద్దికల్, చెన్నూరు, ఆరెపల్లి గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశా రు. గ్రామంలోని కొంచెం స్థలం కూడా వదలకుండా డ్రోన్, డీజీపీఎస్ (డిఫరె న్షియల్ గ్లోబల్ పొజీషనింగ్ సిస్టం)తో సర్వే చేపట్టనున్నారు. హద్దులు గు ర్తిం చి గ్రామకంఠం, అటవీ, సర్కారు, దేవాదాయ, సీలింగ్, పడావు తదితర భూ ములతో పాటు వ్యయ సాయ భూములను సర్వే నంబర్ల వారిగా నక్షా, టిప్పన్ రూపొందిస్తారు.
-కమతాల వారిగా భూధార్‌కార్డులు
కమతాల వారిగా రైతులకు భూధార్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణ యించింది. గ్రామాల్లో ఎంజాయ్ మెంట్ సర్వే చేపట్టి కార్డులు ఇవ్వనున్నారు. ఇందుకుగాను ముందుగా జిల్లాలో 70 గ్రామాల్లో సర్వే చేపట్టేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో భూమి వాస్తవంగా ఎవరి అనుభ వం లో ఉంది ? సర్వే నంబరు, సబ్ డివిజన్ నంబర్ సరైనదేనా ? కాదా ? భూ మికి సమీపంలో రోడ్లు, చెట్లు, ఇళ్లు, జలవనరులు ఏ మైనా ఉన్నాయా ? హ ద్దులు పాత రికార్డులతో సరిపోతున్నాయా ? లేదా ? అనే కోణంలో వివరాలు సేకరిస్తారు. తద్వారా భూమి హక్కుల నిర్ధారణ చేసి, అను భవదారు కాలం లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా భూధార్ కార్డులను అందజేయనున్నా రు. ఇప్పటికే యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలని కేంద్రం ఇచ్చిన మార్గద ర్శకాలను దృష్టిలో పెట్టుకొని భూధార్ ఇస్తారని అధికారులు చెబుతున్నారు.