Canara Bank Chairman: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:26 AM
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కెనరాబ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే సత్యనారాయణ రాజు అభిప్రాయపడ్డారు.
కెనరాబ్యాంకు సీఎండీ సత్యనారాయణరాజు
బెంగళూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కెనరాబ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే సత్యనారాయణ రాజు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛతా హై సేవా పిలుపులో భాగంగా గురువారం బనశంకరి బీడీఏ కాంప్లెక్స్ ప్రాంగణంలో శ్రమదానం చేశారు. కెనరాబ్యాంకు ప్రధాన కార్యాలయంతోపాటు నగరపరిధిలోని బ్యాంకుశాఖల ఉద్యోగులు 250మందికిపైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ప్రధానమంత్రి స్వచ్ఛతా పిలుపు మేరకు సమాజంలో చైతన్యం తీసుకురావాలనే స్వచ్ఛతా హై సేవా నిర్వహిస్తున్నామన్నారు. భారత్ అతిపెద్ద ఆర్థికదేశంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ దశలో ఆర్థికతలో సాధనే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం కీలకమన్నారు. అందుకే కెనరాబ్యాంకు ఓ పోరాటంలాగా స్వచ్ఛతా హై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.