తరగతికొక్కరు.. ముచ్చటగా ముగ్గురు
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:58 AM
ఆ పా ఠశాలలో తరగతికి ఒక్కొక్కరు చొప్పున ముచ్చటగా ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. 1,2,3వ తరగతులకు ఒక్కొక్క విద్యార్థి చొప్పునే ఉన్నా రు.
తరగతికొక్కరు.. ముచ్చటగా ముగ్గురు
జువ్విగూడెం పాఠశాలకు విద్యార్థులు కరువు
ఉపాధ్యాయుడు కూడా ఒక్కడే
మీటింగ్ ఉన్నా... సెలవు పెట్టినా బడి బంద్
నార్కట్‌పల్లి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఆ పా ఠశాలలో తరగతికి ఒక్కొక్కరు చొప్పున ముచ్చటగా ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. 1,2,3వ తరగతులకు ఒక్కొక్క విద్యార్థి చొప్పునే ఉన్నా రు. అలాగనీ ఉపాధ్యాయులు కూడా ఎక్కువేమీ లేరు. ఆయన కూడా ఒక్కడే. నార్కట్‌పల్లి మం డలంలోని జువ్విగూడెం మండల పరిషత ప్రా థమిక పాఠశాల పరిస్థితి. పాఠశాలకు విద్యార్థు లు కరువయ్యారు. ఈ మాత్రం సంఖ్య కూడా ఉందంటే పాఠశాల ఉపాధ్యాయుడు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పిస్తేనే వారు పంపిస్తున్నారు. సంఖ్య తక్కువగా ఉండటానికి జువ్విగూడెంలో ఉన్న విద్యార్థులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల కు వెళ్లడం అదేవిధంగా గ్రామ పంచాయతీ మ ధిర గ్రామమైన కృష్ణపురం కాలనీ విద్యార్థులు ఎక్కువగా పక్కనే ఉన్న తొండ్లాయి పాఠశాలకు వెళ్తుండటమే కారణం. జువ్విగూడెం పాఠశాల కు ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే తిరుమలగిరి, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో ఎంపీపీఎ్‌సలు ఉన్నాయి. దీంతో ఈ పాఠశాల కు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం లేదు. కృ ష్ణాపురం కాలనీవాసుల పిల్లలను జువ్విగూడెంలోనే చేర్పిస్తే కొంచెం సంఖ్య పెరగనుంది. పైగా ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అధికారిక సమావేశానికో లేదా వ్యక్తిగత సెలవుపైనో వెళితే ఆ రోజు పాఠశాలకు సెలవు ఇచ్చినట్టే.
సంఖ్య పెరగకుంటే ఆలోచిస్తాం
జువ్విగూడెం ఎంపీపీఎ్‌సలో విద్యార్థుల సంఖ్య ముగ్గురు మాత్రమే ఉన్న విషయాన్ని ఎంఈవో కూకుట్ల నర్సింహ దృష్టికి తీసుకుపోగా బడిబాట నిర్వహించినా ఎవరూ రాలేదని తెలిపారు. కొన్ని రోజులు వేచిచూసి అప్పటికీ సం ఖ్య పెరగకపోతే ఉన్నతాధికారుల సూచనల మే రకు నిర్ణయం తీసుకుంటాం.