kumaram bheem asifabad- పంచాయతీ ఎన్నికలపై స్పష్టత
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:49 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు జోష్‌తో స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపడుతున్న ఆభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది
- 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చర్యలు
- పాత రిజర్వేషన్ల ఆధారంగానే వెళ్లాలని నిర్ణయం
- జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 18 (ఆంధ్రజ్యో తి): స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు జోష్‌తో స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. డిసెంబరు 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపడుతున్న ఆభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లి తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన క్యాబినెట్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.3 వేల కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది మా ర్చిలోపు ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. అప్పటిలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులను రాబట్టాలని నిర్ణయించింది.
- జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు..
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,76,606 మంది పురుషులు,1,77,269 మంది మహిళలు ఉన్నారు, వీరి కోసం 2,874 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చే యనున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు యం త్రాంగం సిద్ధంగా ఉండడంతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే వార్డుల పునర్వీభజన, ఓటర్ల జాబితా, ఓటరు జాబి తాపై అభ్యంతరాలు స్వీకరణ పూర్తయ్యాయి. బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది, నోడల్ అధికారుల కేటా యింపు, రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రెండు విడతలుగా ఆర్వోలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇ చ్చారు. సర్పం చులకు గులాబీరంగు, వార్డు సభ్యు లకు తెలుపురంగు బ్యాలేట్ పేపర్లను ముద్రించేం దుకు సిద్ధంగా ఉంచారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపుపై పలువురు హైకోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చారు. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
- మొదట పంచాయతీలకు..
తొలుత పంచాయతీ తదుపరి పరిషత్ ఎన్నిక లను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీ వల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌లో మొదట పరిషత్, తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించారు. మారిన పరిస్థితుల్లో తొలుత పంచాయతీ తదుపరి పరిషత్ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైకో ర్టులో సైతం పంచాయతీ ఎన్నికల పైనే కేసులు ఉండటంతో రిజర్వేషన్ల పీటముడి విప్పి ఎన్నికలకు పోనుంది. కాగా కోర్టు రిజర్వేషన్లపై స్టే విధించడం, 24లోపు ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చేపడుతారో హైకోర్టుకు తెలపాల్సి ఉండడంతో ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2019లో స్థానిక సంస్థల్లో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశా లున్నాయని చెబుతున్నారు.
మండలాల వారీగా ఓటర్లు...
మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
ఆసిఫాబాద్ 15,039 15,276 0 30,315
బెజ్జూరు 11,685 12,047 2 23,734
చింతలమానేపల్లి 12,118 11,837 0 23,955
దహెగాం 11,014 11,077 1 22,092
జైనూరు 11,936 12,427 0 24,363
కాగజ్‌నగర్ 22,857 22,383 2 45,242
కెరమెరి 12,145 11,880 1 24,026
కౌటాల 13,796 13,560 1 27,357
లింగాపూర్ 5,103 5,479 1 10,583
పెంచికలపేట 6,218 6,084 0 12,302
రెబ్బెన 14,523 14,201 0 28,724
సిర్పూర్(టి) 11,016 11,163 3 22,182
సిర్పూర్(యూ) 5,835 6,440 2 12,277
తిర్యాణి 8,863 9,281 4 18,148
వాంకిడి 14,458 14,134 3 28,595