kumaram bheem asifabad- ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:53 PM
ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్ వేడుకలను చర్చిలలో, క్రైస్తవుల గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కోసి సంబరాలు చేసుకున్నారు. హాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బైబిల్‌ను పఠించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను నిర్వహిం చారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రార్థనలు.. సందేశాలు... గీతాలతో గురువారం క్రిస్మస్ వేడుకలను చర్చిలలో, క్రైస్తవుల గృహాల్లో ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కోసి సంబరాలు చేసుకున్నారు. హాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బైబిల్‌ను పఠించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో గురువారం క్రిస్మస్ వేడుకలను నిర్వహిం చారు. ఈ సంధర్బంగా జిల్లా కేంద్రంలో ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని సీఎస్‌ఐ. జన్కాపూర్ సెయింట్ మేరి, దశ్నాపూర్, రాజంపేట, ఎన్‌జీవోస్ కాలనీ, సందీప్‌నగర్ కాలనీలలో ఉన్న చర్చిలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపు కున్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని వాంకిడి మండలంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల చర్చిల్లో క్రిష్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రంలోని చర్చిలో వాంకిడి సర్పంచ్ సతీష్, వాంకిడి, జంబుల్‌ధరి ఉపసర్పంచ్‌లు దీపక్‌ముండే, విఠల్, వార్డు సభ్యులు కేక్‌కట్ చేశారు. ఆయా చర్చిల్లో ఫాస్టర్లు ప్రభాకర్, యేసుదాసు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు ఆరాధనలు, పాటలు, దేవుడి వాక్యాల ఆలాపనలతో ప్రార్థన మందిరాలు మార్మోగాయి. వివిద గ్రామాల్లోని చర్చిల్లో చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ వేడుకలను గురువారం రెబ్బెన మండలంలోని కార్మెల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. కేక్‌కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భరద్వాజ్, ఉపసర్పంచ్ వరలక్ష్మి, సింగిల్ విండో మాజీ వైస్ చేర్మన్ రంగు మహేష్, శ్రీధర్, ఫాదర్ రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గల చర్చిలలో గురువారం క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెంతకోస్తు చర్చిలో పాస్టర్ రత్నకుమార్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు,సిర్పూర్(యు),జైనూర్ మండలం శివనూర్ సర్పంచ్‌లు ఆత్రం ఓంప్రకాష్, శ్రావణ్, నాయకులు, జిల్లేపల్లి శంకర్, ఆత్రం ఆనంద్‌రావు, కే ఆంధ్రయ్య, రంగస్వామి, ప్రెమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు పెద్ద సిద్దాపూర్,చిన్న సిద్దాపూర్, ఎల్కపల్లి. మర్థిడి, లంబడిగూడ, తదితర గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ సంధర్ఛంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
్జకెరమెరి, (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ వేడుకలను మండల కేంద్రంలో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభ కాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో పాస్టర్ ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.