Chief Priest CS Rangarajan: చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు స్వామి వివేకానంద పురస్కారం
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:18 AM
రాజ్యాంగ రామరాజ్య స్థాపన, ముని వాహన ఉత్సవ పునరుద్ధరణలో కృషికి గుర్తింపుగా చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్...
మహారాష్ట్ర గవర్నర్ దేవ్‌వరత్ ఆధ్వర్యంలో ప్రదానం
మొయినాబాద్ రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ రామరాజ్య స్థాపన, ముని వాహన ఉత్సవ పునరుద్ధరణలో కృషికి గుర్తింపుగా చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌కు స్వామి వివేకానంద పురస్కారం లభించింది. యూపీలోని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖజాంచీ గోవిందదేవ్ గిరి స్వామిజీ ఆధ్వర్యంలో పుణెలోని గీతా జయంతి వేదశ్రీ తపోవన సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో రంగరాజన్‌కు మహారాష్ట్ర గవర్నర్ దేవ్‌వరత్ ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక అడ్డంకులను తొలగించే సందేశాన్నిస్తున్న మునివాహన ఉత్సవ పునరుద్ధరణకు గుర్తింపుగా లభించిన పురస్కారం తనను మరింత బలోపేతం చేస్తుందన్నారు.