Share News

kumaram bheem asifabad- ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు చేయించాలి

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:26 PM

జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆధార్‌ నమోదు చేయించాలన్లి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంఓలని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం విద్యా, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, తపాల, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్‌ నమోదు చేయించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆధార్‌ నమోదు చేయించాలన్లి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంఓలని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో శుక్రవారం విద్యా, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, తపాల, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఆధార్‌ నమోదు కేంద్రాలు పని చేయాలన్నారు. ఐదు, 15 సంవత్సరాలు దాటిన వారు ఆధార్‌ బయోమెట్రిక్‌ చేయించుకోవాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో గల 102 గిరిజన గ్రామాలలో ప్రధాన మంత్రి జూగా పథకం కింద శిబిరాలు నిర్వహిస్తు న్నందున ఆధార్‌ నమోదు కేంద్రాలు, ఆధార్‌ కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌ భవనంలోని ఈ-డిస్ట్రిక్‌ మేనేజర్‌ గౌతంను సంప్రదించాలని సూచించారు. సమావే శంలో రీజియన్‌ యూఐడీ అసిస్టెంట్‌ మేనేజర్‌ మహమ్మద్‌ సౌబన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మినారాయణ, లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌జోషి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2025 | 11:26 PM