Share News

పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:19 PM

పిల్లల్ని ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించి పా ఠశాలలను పరిరక్షించుకోవా ల్సిన బాధ్యత మనందరిపై ఉం దని ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు.

పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
చెన్నపురావుపల్లిలో బడిబాట కార్యక్రమం గురించి గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి

- ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి - టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో బడిబాట

పెద్దకొత్తపల్లి, మే 27 (ఆంధ్రజ్యోతి) : పిల్లల్ని ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించి పా ఠశాలలను పరిరక్షించుకోవా ల్సిన బాధ్యత మనందరిపై ఉం దని ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ పిలు పులో భాగంగా మండలంలోని చెన్నపురావుపల్లిలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని మం గళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాట్లాడుతూ గ్రామంలో మూతపడి న పాఠశాలను వెంటనే తెరవాలని, దీనికోసం ప్రత్యేకంగా ఒక టీచర్‌ను కేటాయించామని దీ నికి గ్రామస్థుల సహకారం కావాలని కోరారు. ఎలాంటి సహాయ సహకారాలైనా మండల విద్యాశాఖ నుంచి అందివ్వడానికి సిద్ధంగా ఉ న్నామని తెలిపారు. గ్రామంలో పాఠశాల ప్రా రంభమైన వెంటనే నెలలోపు తన సొంత ఖర్చు నుంచి విద్యార్థులకు టై, బెల్టులు ఉచితంగా అందిస్తానని ఎంఈవో తెలిపారు. టీఎస్‌యూ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.కృష్ణ మాట్లాడుతూ గ్రామాలల్లో పాఠశాలలు దేశానికి పట్టుగొమ్మ లని, మన ఊరు మన బడిని మనమే కాపా డుకోవాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ గౌస్‌బాషా, డి.మల్లయ్య, ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి వి.లక్ష్మీపతి, ఉ పాధ్యాయులు పవన్‌, కిరణ్‌, కార్తీక్‌, తిరుపత య్య, సీఆర్పీ రాముయాదవ్‌ పాల్గొన్నారు

Updated Date - May 27 , 2025 | 11:19 PM