Share News

kumaram bheem asifabad- బాల్య వివాహాలను అరికట్టాలి

ABN , Publish Date - Nov 27 , 2025 | 10:30 PM

బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీవో మహేష్‌ అన్నారు. తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, సూర్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం అమ్యూలమని అన్నారు. బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు. చదువు మధ్యలో ఆగిపోవడం, జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

kumaram bheem asifabad- బాల్య వివాహాలను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీవో మహేష్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీపీవో మహేష్‌ అన్నారు. తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, సూర్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం అమ్యూలమని అన్నారు. బాల్య వివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పారు. చదువు మధ్యలో ఆగిపోవడం, జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రభుత్వం బాలికల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు. 2030 నాటికి బాల్య వివాహాలు లేని దేశంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. పిల్లలు అంకిత భావం , క్రమ శిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎంసీ శారద, ప్రధానోపాధ్యాయులు మహేష్‌, ఉపాధ్యాయులు శ్రీవర్ధన్‌, సూర్‌ సంస్థ కో ఆర్డినేటర్‌ సంతోష్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌కుమార్‌, కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కో ఆర్డినేటర బాలప్రవీణ్‌, దేవాజీ, జెండర్‌ స్పెషలిస్టు రాణి, సాగర్‌, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డీసీపీవో మహేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చైల్డ్‌ రైట్స్‌, పోక్సో చట్టం, జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌, బాల్య వివాహాల నిషేధ చట్టం తదితర బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 10:30 PM