బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - Jun 24 , 2025 | 12:46 AM
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేణుక అన్నారు.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
డిండి, జూన 23(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రేణుక అన్నారు. మండల కేంద్రంలో ని సోమవారం ఆదర్శ పాఠశాలలో జరిగిన కిషోర బాలికల అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. 18 సంవ్సరాలు నిండిన తర్వాతే బాలికలకు వివాహం చేయాలని సూచించారు. మేనరికం, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి వివరించారు. కిషోర బాలికలు సెల్‌ఫోన్లు వాడటం వల్ల కలిగే ఇబ్బందుల గురిం చి వివరించారు. ఐసీపీఎస్ అధికారి అంజలి మాట్లాడుతూ మిషన వాత్సల్యపై అవగాహన కల్పించారు. బాలల హక్కులు, చైల్డ్ హెల్ప్‌లైనలకు సంబంధించిన 1098, 100 టోల్‌ఫ్రీ నెంబర్ల ఆవశ్యకతను తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, విద్య ఆవశ్యకతపై బాలికలకు వివరించారు. అలాగే దత్తత తీసుకునే విధానంపై అ వగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతి, అంగనవాడీ టీచర్లు, కిషోర బాలికలు పాల్గొన్నారు.