Share News

kumaram bheem asifabad-ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:31 PM

జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు కేక్‌ కట్‌ చేశారు.

kumaram bheem asifabad-ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
ఆసిఫాబాద్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌/తిర్యాణి/వాంకిడి/కెరమెరి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు చరణ్‌, అసద్‌, ఆసీఫ్‌, వసంత్‌రావు, కాలీం, జమీర్‌, దీపక్‌, శివప్రసాద్‌, గోపాల్‌, జలీమ్‌, ప్రవీణ్‌, మహేష్‌, జావీద్‌, అబ్బు, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. తిర్యాణి మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆత్రం వినోద్‌, అనీల్‌గౌడ్‌, సాగర్‌, వెంకటేశంగౌడ్‌, పున్నంకుమార్‌, రాజు, విజయ్‌, శంకర్‌, బాలేష్‌గౌడ్‌, బాబురావు, వెంకటేష్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ, ప్రశాంత్‌, అనీల్‌, గణేష్‌, శంకర్‌, దాదాజీ, పెంటు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కెరమెరి మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి చేశారు. కార్యక్రమంలో నా యకులు కుసుమరావ్‌, మునీర్‌ అహ్మద్‌, లక్ష్మణ్‌, జగన్నాథ్‌రావు, లింబారావు, జలపతి, సుందరసింగ్‌, తిరుపతి, ధర్ము, రాజు, భీంరావు, బాబునాయక్‌, తిరుపతి, బాబురావు, శంకర్‌, ముకుంద్‌రావు, దిలీప్‌, ముజ్జు, రాజు, సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 10:31 PM