Bathukamma festival: తీరొక్క పూలతో ఘనమైన పండుగ
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:04 AM
సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ నెలవని తెలిపారు...
ప్రజా ప్రభుత్వంలో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యం
రాష్ట్ర మహిళలందరికీ సీఎం.. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి ఈ పండుగ నెలవని తెలిపారు. తీరొక్క పూలతో తయారుచేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడబిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని, చెరువులు, కుంటలను పదిలంగా కాపాడి భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందిస్తున్నామన్నారు. అందుకే అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించామన్న విషయాన్ని గుర్తుచేశారు.