Cherukuri Group chairman Ramarao: చెరుకూరి సంస్థల అధినేత రామారావు కన్నుమూత
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:01 AM
చెరుకూరి గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామారావు 74 కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..
వనస్థలిపురం, నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): చెరుకూరి గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామారావు(74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ బీఎన్‌రెడ్డినగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం మృతి చెందారు. సమాచారం అందుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాగా, రామారావుకు ఇద్దరు కుమారులున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు చెరుకూరి గోపీనాథ్ మాట్లాడుతూ.. సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా వృత్తి జీవితం ప్రారంభించిన రామారావు.. చెరుకూరి గ్రూప్‌ను స్థాపించి 10 వేల మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. కొత్తగూడెం పీర్లగూడెంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం సాయంత్రం రామారావు అంత్యక్రియలు ముగిశాయి.