kumaram bheem asifabad-నీటి ఉధృతిని పరిశీలించి.. సూచనలు చేసి..
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:00 PM
జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు ఆసిఫాబాద్ మండలం రాజూర గ్రామ సమీపంలోని ఒర్రె ఉధృతంగా ప్రవహించ డంతో గ్రామస్థులు అటువైపు వెళ్లెందుకు నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్‌పీవో ఉమర్, తహసీల్దార్ రియాజ్‌ఆలీ పరిశీలించి సూచనలు చేశారు.
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు ఆసిఫాబాద్ మండలం రాజూర గ్రామ సమీపంలోని ఒర్రె ఉధృతంగా ప్రవహించ డంతో గ్రామస్థులు అటువైపు వెళ్లెందుకు నిరీక్షించాల్సి వచ్చింది. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్‌పీవో ఉమర్, తహసీల్దార్ రియాజ్‌ఆలీ పరిశీలించి సూచనలు చేశారు. కాగజ్‌నగర్-వాంకిడి మార్గంలో ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బందిని వివరాలు అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ రామానుజం, సిబ్బంది ఉన్నారు.
దహెగాం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలు కురుస్తున్నందున పెసరికుంట గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా అన్నారు. మండలంలోని పెసరికుంట, బీబ్రా, అయినం, దహెగాం గ్రామాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురిసి వర్షాలకు కుమరం భీం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి వేసి నీటినిని కిందికి వదులుతున్నందున పెద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పెద్దవాగు సమీపంలోని ఐదు కుటుంబాలను పెసరికుంట గ్రామంలోని సీఎస్‌ఐ చర్చికి తరలించాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచాలని తహసీల్దార్ మునావర్ షరీఫ్‌కు సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ మునావర్ షరీఫ్, ఎంపీడీవో రాజేందర్, ఎంఆర్‌ఐ నాగభూషణం, కార్యదర్శులు రాజేష్, ప్రణీత్‌బాబు, తదితరులు ఉన్నారు.